: జైలు వద్దకు బాబాయి
అక్రమాస్తుల కేసులో నెలల తరబడి రిమాండ్ ఖైదీగా కారాగార జీవితాన్ని గడిపిన జగన్ మరికాసేపట్లో స్వేచ్ఛావాయువులు పీల్చనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు స్వాగతం పలికేందుకు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. జగన్ కోసం పార్టీ ఎమ్మెల్యేలు కూడా జైలు ఎదుట నిరీక్షిస్తున్నారు.