: నిర్భయ హంతకులకు మరణశిక్షపై హైకోర్టులో విచారణ
ఢిల్లీ హైకోర్టులో నిర్భయ కేసు విచారణ ప్రారంభమయింది. నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించడంతో... నలుగురు దోషులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ కేసుపై ఈ రోజు నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా ఈ రోజు నలుగురు దోషులను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరుపరిచారు. ఈ విచారణ ఇక రోజూ కొనసాగనుంది.