: జగన్ కు బెయిల్ పై కాంగ్రెస్ నేత హర్షం
అక్రమాస్తుల కేసులో జగన్ కు బెయిల్ లభించడం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తే అదేమీ పెద్ద విషయం కాదు. కానీ, ఓ కాంగ్రెస్ నేత సంతోషం వ్యక్తం చేస్తే..! నిస్సందేహంగా ఆలోచించాల్సిన విషయమే. జగన్ కు బెయిల్ రావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి పరమానంద భరితులయ్యారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు బెయిల్ రావడం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా పరిగణిస్తుందో చూడాలి.