: సీమాంధ్ర ఆందోళనల వల్ల తెలంగాణ ఉద్యోగులకూ దసరా బోనస్ ఇవ్వలేం: ఆర్టీసీ
సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 27న తెలంగాణ వ్యాప్తంగా డిపోల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ప్రకటించారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికులందరికీ ప్రాంతీయ బేధాలు లేకుండా దసరా అడ్వాన్స్ ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది.