: జేసీ సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ తో కలిసి పనిచేయాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి అసలు కాంగ్రెస్ అంటూ ఉంటే కదా? అని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బయట ఉన్నా, లోపల ఉన్నా కాంగ్రెస్ పని ఇక అంతే అని అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని చంద్రబాబు ఇవాళ కొత్తగా ఏమీ చెప్పడంలేదని కూడా స్పష్టం చేశారు. ఇక, రాష్ట్ర విభజన అంశంపైనా తనదైన శైలిలో స్పందించారు. జగన్ దీక్ష చేపట్టినా సమైక్యాంధ్ర సాధ్యం కాదని అన్నారు. ఒక్క సోనియా తలచుకుంటేనే రాష్ట్ర విభజన ఆగిపోతుందని తేల్చిచెప్పారు.