: జగన్ రోడ్ మ్యాప్ ఇదే..


కాసేపట్లో వైఎస్ జగన్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జైలు నుంచి ఆయన లోటస్ పాండ్ లోని ఇంటికి చేరుకోనున్నారు. దీనికోసం పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన ప్రయాణం కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేశారు. ఆయన చంచల్ గూడ జైలు నుంచి ఎంజే మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డెక్కన్, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్, ఫిల్మ్ నగర్ మీదుగా లోటస్ పాండ్ చేరుకోనున్నారు.

ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో ఆయన సెక్రటేరియేట్ దగ్గర తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేయనున్నారు. అలాగే పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News