: కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను మోసం చేస్తోంది: ఎంపీ మోదుగుల
కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల పేరిట నాటకాలాడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే అందరూ ఏకతాటిపై నిలబడతారని, ఎవరు సర్దిచెప్పినా రాజీనామాలపై వెనక్కి తగ్గేలా వారు కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే రాజీనామా నాటకాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.