: ఈ నెల 30 తరువాత సమ్మె మరింత తీవ్రం
ప్రజల్లోకి రావాలంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు రాజీనామాలు చేయాల్సిందేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30 తరువాత సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన మండిపడ్డారు.