: చంచల్ గూడ జైలు వద్ద పెరుగుతున్న హడావుడి


అక్రమాస్తుల కేసులో దాదాపు 16 నెలలు రిమాండ్ అనుభవించిన వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం బెయిల్ పై విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద హడావుడి నెలకొంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మీడియా ప్రతినిధులు కూడా జగన్ విడుదల క్షణాలను ప్రపంచానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, ఈ ఉదయం జైలు ఎదుట ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఓ దశలో పోలీసులకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

  • Loading...

More Telugu News