: 'జగన్ కు ష్యూరిటీ' పత్రాల పరిశీలన పూర్తి
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టు నిన్న షరతులతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రెండు లక్షల రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు నిన్న జగన్ తరుపు న్యాయవాదికి సూచించింది. ఈ క్రమంలో ఆయన పూచీకత్తుకు అవసరమైన పత్రాల పరిశీలన పూర్తయింది. ఈ మేరకు బెయిల్ ఆర్డర్ ను న్యాయస్థానం చంచల్ గూడ జైలు అధికారులకు పంపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జగన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.