: మూడు రోజుల్లో 90 లక్షల ఐఫోన్ 5ఎస్, 5సీల అమ్మకం


ఇటీవలే విడుదలైన ఐఫోన్ 5ఎస్, 5సీ మొబైల్ ఫోన్లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. హై ఎండ్ మొబైల్ వినియోగదారులు వీటిని ఎగబడి కొంటున్నారు. దీంతో, వీటి అమ్మకాలు పాత రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. సెప్టెంబర్ 20 న మార్కెట్లోకి వచ్చిన 5ఎస్, 5సీ అమ్మకాలు కేవలం మూడు రోజుల్లోనే 90 లక్షలు దాటాయని యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ప్రాంతాల వారీ అమ్మకాల వివరాలను యాపిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం 5ఎస్, 5సీ అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ప్యూర్టోరికో దేశాల్లో లభిస్తున్నాయి. మన దేశంలో వీటి అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే గ్రే మార్కెట్లో మరో రెండు రోజుల్లోగా ఈ ఫోన్లు లభించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News