: భార్యకు భయపడ్డానంటున్న ఒబామా
యుద్ధానికి కాలుదువ్వినా, తానే గొప్ప అని విర్రవీగినా, సాక్షాత్తూ అమెరికాకి అధ్యక్షుడైనా భార్య ముందు పిల్లే అని నిరూపించాడు బరాక్ ఒబామా. ఆమెకు భయపడి చివరకు సిగరెట్లు కూడా కాల్చడం మానేశానని చెప్పాడు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మైనా కై పొగతాగే అలవాటు గురించి ఒబామాను ప్రశ్నించారు. అందుకు ఒబామా బదులిస్తూ.. తన భార్య మిషెల్ అంటే ఉన్న భయం కారణంగా సిగరెట్లు మానేశానని తెలిపారు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని, సిగరెట్లు మానేయాల్సిందేనని మిషెల్ వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. దాంతో 95 శాతం సిగరెట్లు మానేశానని తెలిపారు.