: 50 లక్షలు దాటిన భూ విక్రయాలపై 1% టీడీఎస్


అధిక విలువ కలిగిన భూ క్రయ విక్రయాలపై చిదంబరం ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా లావాదేవీలు జరుగుతున్నా వాటిపై ప్రభుత్వానికి పన్ను చేరకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అందుకే 50లక్షలు పైబడిన భూ విక్రయాలపై 1 శాతం పన్ను (టీడీఎస్) కింద విక్రయ సమయంలోనే చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

ఒకవేళ ఆ విక్రయాలను ఆదాయపన్ను రిటర్నులలో చూపిస్తే ముందు చెల్లించిన 1 శాతం పన్నును రిఫండ్ కోరవచ్చు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు చిదంబరం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయ భూముల విక్రయాలను టీడీఎస్ నుంచి మినహాయించారు. 

వాస్తవానికి 1 శాతం పన్ను చెల్లించి ఊరుకున్నా ప్రమాదమే. వాటిని రిటర్నులలో చూపించకుంటే.. ఆదాయపన్ను అధికారులు నల్లధనంగా భావించి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే ప్రమాదం లేకపోలేదు. 

  • Loading...

More Telugu News