: దేవుడి వల్లే ఈ అద్భుతం జరిగింది: షర్మిల
కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కవడం వల్లే జగన్ కు బెయిల్ వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుంటే.. దేవుడి వల్లే ఈ అద్భుతం జరిగిందని వైఎస్ షర్మిల అంటున్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం జగన్ ను అణగదొక్కాలని ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే, దేవుడు తమకు న్యాయం చేశాడని పేర్కొన్నారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం జగన్ చేతుల్లోకి వెళ్ళడం భరించలేకే కాంగ్రెస్ కుట్ర పన్నిందని తెలిపారు. జగన్ విడుదలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం తొణికిసలాడుతోందని, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.