: పన్నెండేళ్ళకే..
కర్ణాటకలో ఓ బాలిక పన్నెండేళ్ళకే తల్లయిన ఘటన విస్తుగొలుపుతోంది. బెంగళూరు సమీపంలోని నెలమంగళ ప్రాంతంలోని నందిహళ్ళి గ్రామంలో పన్నెండేళ్ళ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు. అవి పురిటి నొప్పులని గ్రహించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. దీంతో, మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ బిడ్డకు తండ్రి అదే గ్రామానికి చెందిన నవీన్ (23) అని భావిస్తున్నారు. బాలికకు బంధువైన అతడే అత్యాచారానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.