: అశోక్ బాబుకు ఎర్రబెల్లి వార్నింగ్
అనంతపురం జిల్లా హిందూపురంలో నిన్న నిర్వహించిన లేపాక్షి బసవన్న రంకె సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు వార్నింగ్ ఇచ్చారు. 'పొద్దున లేస్తే తినడానికి ఆంధ్రా హోటళ్ళు కావాలి, చదువుకోవడానికి ఆంధ్రా విద్యాసంస్థలు కావాలి..' అంటూ అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ఘాటుగా స్పందించారు. అశోక్ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సీమాంధ్ర అభిజాత్యం ప్రదర్శించవద్దని సూచించారు.