: మరోసారి కూర్చొని మాట్లాడుకుంటాం: హర్షకుమార్
రాజీనామాలతో ఒత్తిడి పెరుగుతుందే తప్ప... జరుగుతున్న ప్రక్రియ ఆగదని ముఖ్యమంత్రి చెప్పారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. డిసెంబర్ 12 వరకు ప్రక్రియను ఆపగలిగితే... తెలంగాణ బిల్లు ఆగిపోతుందని సీఎం అన్నట్టు తెలిపారు. సీమాంధ్ర ఎంపీలందరూ కలసి పార్లమెంట్ లో బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరముందని సీఎం అన్నారని చెప్పారు. దీంతో ఎంపీలందరం స్పీకర్ ను కలిసేలోగా మరోసారి కూర్చొని మాట్లాడుకుంటామని హర్షకుమార్ తెలిపారు. దీనికితోడు రాజీనామా చేయాలనుకుంటే అందరం కలిసే చేద్దామని కిరణ్ అన్నట్టు ఆయన చెప్పారు. సీమాంధ్రలోని ప్రజలు, ఎన్జీవోలు ప్రజా ప్రతినిధుల రాజీనామాలు కోరుతున్నారని ఎంపీ తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపీలందరం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించామని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాదును వదులుకునే ప్రసక్తే లేదని తెలిపారు. హైదరాబాద్ అంశం తేలేవరకు ఉద్యమం చల్లారదని ఎంపీ అన్నారు.