: సెబీ బలోపేతానికి చర్యలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ను మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టబోతున్నట్లు మంత్రి చిదంబరం తెలిపారు. ఇందుకోసం చట్ట సవరణ తీసుకురానున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. కాగా, బడ్జెట్ లో 3000 కిలోమీటర్ల కొత్త రహదారుల్ని ప్రతిపాదించారు.
మరోవైపు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులను ప్రొత్సహించేందుకు 6 శాతం వడ్డీతో రుణాలు ఇస్తామని చెప్పారు. అంతరిక్ష రంగానికి రూ.5వేల కోట్లు, రక్షణ రంగానికి రూ.2,03 లక్షల కోట్లు కేటాయించారు.