: వందేళ్ళ సినీ వేడుకల ముగింపు ఉత్సవానికి రాష్ట్రపతి


దక్షిణ భారత చలనచిత్ర మండలి, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతీయ సినిమా వందేళ్ళ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలనుంచి ఏడుగురు చొప్పున మొత్తం 28మందిని సన్మానించనున్నారు.

  • Loading...

More Telugu News