: 294 పట్టణాలకు ఎఫ్ఎం ఛానెళ్ల సేవలు
దేశంలోని రెండు విశ్వ విద్యాలయాలకు నిధులు ప్రకటించిన ఆర్ధికమంత్రి చిదంబరం, కొత్త ఎఫ్ఎం ఛానెళ్లకు ఆనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. 294 పట్టణాలకు ఎఫ్ ఎం సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపారు.
- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
- టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు రూ.100 కోట్లు కేటాయించారు.
- 253 కోట్లతో పాటియాలలో జాతీయ క్రీడల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదీ 3 సంవత్సరాలలోపు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
- కొత్త ఎఫ్ఎం ఛానెళ్లకు అనుమతి
- విద్యారంగానికి కేటాయింపుల్లో 17 శాతం పెంపు
- గ్రామీణాభివృద్ధి కేటాయింపుల్లో 46 శాతం పెంపు
- జాతీయ బీమా పథకం పరిధిలోకి రిక్షా, ఆటో, పారిశుధ్ధ్య కార్మికులను తీసుకొస్తున్నట్లు ప్రకటన
- పవన విద్యుత్ రంగానికి ప్రత్యేక ప్రొత్సహకాలు ఇచ్చి మరింత ఊతమిచ్చారు.