: చర్చిపై దాడికి నిరసన
పాకిస్థాన్ లోని పెషావర్ లోని ఆల్ సెయింట్స్ చర్చిపై తెహ్రీకే తాలిబాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిన టీడీపీ, కాంగ్రెస్ మైనార్టీ విభాగం నేతలు ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా హైదరబాదులోని బషీర్ బాగ్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న పెషావర్ చర్చి బయట జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. వారిలో కొంతమంది ఇంకా మృత్యుముఖం నుంచి బయటపడలేదని సమాచారం.