: భారత్, పాక్ సరిహద్దులో ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్ వద్ద భారత్-పాక్ సరిహద్దులో ఒక తీవ్రవాదిని మన భద్రతాదళాలు కాల్చి చంపాయి. పాక్ భూభాగం నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని మచ్చీ సెక్టార్ లో ఈ సంఘటన జరిగింది. కొందరు ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా, భద్రతాదళాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఒక తీవ్రవాది చనిపోయాడు. మిగిలిన వారు పారిపోయారు.