: సునిశిత నిఘా కోసం 5 వేల కెమెరాలు: ముఖ్యమంత్రి


హైదరాబాదులో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ అభిప్రాయపడ్డారు. దీనికోసం నగరంలో 5 వేల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, వాటన్నింటినీ అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల నగరంలో తీవ్రవాద కార్యకలాపాలను గుర్తించే వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర జనాభా అనూహ్యంగా పెరిగిపోయిందని, దానికి తగ్గట్టు పోలీసుల సంఖ్య పెరగలేదని తెలిపారు. కాబట్టి నేరాలను అరికట్టడానికి టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిరణ్ అభిప్రాయపడ్డారు. మతసామరస్యాన్ని కాపాడాలంటే రాజకీయంగా బలీయమైన సంకల్పం ఉండాలని అన్నారు. దీంతో పాటు పాలనా వ్యవస్థలోని అన్ని స్థాయిలకు చెందిన ఉద్యోగుల్లో అంకితభావం, ప్రజల్లో చైతన్యం అవసరమని సీఎం సూచించారు.

  • Loading...

More Telugu News