: విధిలేక జగన్ కు బెయిలిచ్చారు: బాలినేని


మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేమన్న విధిలేని పరిస్థితుల్లో బెయిల్ ను మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించడం పట్ల స్పందిస్తూ.. కాంగ్రెస్ తో కలిసేది లేదని ఎప్పుడో చెప్పామని అన్నారు. చంద్రబాబే ఒకప్పుడు బీజేపీతో కలిసి తప్పుచేశామని చెబుతూ, తాజాగా ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని, తాము అలాంటి అవకాశవాద రాజకీయాలకు పాల్పడబోమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News