: ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీపై లోకాయుక్తలో పిటిషన్
సీమాంధ్ర ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని కోట్లాది రూపాయలను పోగేసుకుంటున్న పైవేట్ ట్రావెల్ ఆపరేటర్లపై లోకాయుక్తలో పిటిషన్ దాఖలైంది. సమ్మె కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేటు వాహనాల యజమానులు సామాన్యులను దోపిడీ చేస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ప్రైవేటు వాహన దారులు అధిక ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రవాణా శాఖ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాకుండా పోలీసు ఎస్కార్టుతో బస్సులు నడిపేలా ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు.