: జగన్ ఏ తప్పూ చేయలేదని స్పష్టమైంది: అంబటి


అక్రమాస్తుల కేసులో జగన్ కు బెయిల్ లభించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఆ పార్టీనేత అంబటి రాంబాబు నాంపల్లి కోర్టు వద్ద మాట్లాడుతూ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కుట్ర పన్ని జగన్ కు బెయిల్ రాకుండా చేయాలని చూశాయని ఆరోపించారు. తొలుత జగన్ ను అరెస్టు చేసిన 90 రోజుల తర్వాత చార్జ్ షీట్ దాఖలు చేస్తారని భావించామని, సీబీఐ అలా చేయకుండా ఆయనకు రిమాండ్ కొనసాగించిందని చెప్పారు. ఎనిమిది కంపెనీల్లో క్విడ్ ప్రొ కో జరిగిందని సీబీఐ, టీడీపీ ఆరోపించాయని.. అయితే, జగన్ కడిగిన ముత్యంలా బయటికొస్తారని తాను ఆనాడే చెప్పానని అంబటి గుర్తు చేశారు.

ఎన్నాళ్ళు విచారిస్తారని సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కు బెయిల్ మంజూరైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఓ విషయంలో ఆందోళన చెందారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటారేమోనని అందరూ భయపడ్డారని అంబటి వివరించారు. జగన్ తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాల్లేవని దీంతో స్పష్టమైందన్నారు.

  • Loading...

More Telugu News