: రేపే విడుదల.. జగన్ కు షరతులు విధించారు: న్యాయవాది
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రేపు ఉదయం విడుదల కానున్నారని ఆయన న్యాయవాది తెలిపారు. ఈ రోజు కోర్టు సమయం ముగిసినందున రేపు ఉదయం ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఆయనకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులు షూరిటీ సమర్పించాలని, పాస్ పోర్టు కోర్టుకు సమర్పించాలని, హైదరాబాద్ దాటి వెళ్లకూడదని, ఒక వేళ వెళితే కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో, జగన్ రేపు అధికారికంగా విడుదల కానున్నారని ఆయన స్పష్టం చేశారు.