: రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు: జేసీ
సీమాంధ్ర నేతలు ఇప్పటికిప్పుడే రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయడానికి ఇప్పటికే సీమాంధ్ర నేతలంతా సిద్ధంగా ఉన్నారని ఆయనన్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని, పార్లమెంట్ లో బిల్లును ఓడించడానికి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరూ పదవుల్లో ఉండాల్సిన అవసరముందని జేసీ అన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదని ఆయన అన్నారు. అంతే కాకుండా ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన తమపై ఒత్తిడి రాదని చెప్పారు.