: 22 ఏళ్ల యువతిపై అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం గుర్గావ్ లో 22 ఏళ్ల యువతిని ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాడు తోటి ఉద్యోగే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే... గుర్గావ్ లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే 60 మంది ఉద్యోగులు గత శనివారం నాడు ఒక రిసార్ట్ లో పార్టీ అరేంజ్ చేసుకున్నారు. రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత ఆమె రిసార్ట్ లోని తన రూమ్ కి వెళ్లింది. ఆమె వెంటే గదిలోకి ప్రవేశించిన సహ ఉద్యోగి (28) ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా... ఆమెను అత్యంత దారుణంగా బలత్కారం చేశాడు. షాక్ కు గురైన ఆమె ఈ రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కూడా ఆమె అత్యాచారానికి గురైందని రిపోర్టు ఇచ్చారు.