: గృహ రుణాలు మరింత ఆకర్షణీయం


గృహ రుణాలు తీసుకునేవారిని ప్రోత్సహించే నిర్ణయాన్ని చిదంబరం ప్రకటించారు. ఇప్పటి వరకూ వార్షికంగా లక్షా యాభై వేల వరకూ గృహ రుణంపై చెల్లించే వడ్డీకి ఆదాయ పన్నునుంచి మినహాయింపు ఉండేది. దానిని మరో లక్ష మేరకు పెంచారు.

అంటే అధిక ఆదాయం కలిగిన వారు (ఎగువ మధ్య తరగతి) గృహ రుణం తీసుకోవడం ద్వారా ఏటా 2.5 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలను ఆదా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల గృహ మార్కెట్ వృద్ధి చెందుతుందని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు . 

  • Loading...

More Telugu News