: మీకు తినడానికి మా హోటళ్లు, చదవడానికి మా విద్యాసంస్థలు కావాలి: అశోక్
హిందూపురంలో --జరుగుతున్న 'లేపాక్షి బసవన్న రంకె' సభలో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులంతా ఇక్కడకు వచ్చి హైదరాబాదును దోచుకున్నారని తెలంగాణవాదులు అంటున్నారని... ఇలాంటి విమర్శలు చేయడం వారు మానుకోవాలని సూచించారు. 'హైదారాబాద్ లోని తెలంగాణవారికి పొద్దున లేస్తూనే తినటానికి మా హోటళ్ళు కావాలి... వాళ్ల పిల్లలు చదువుకోవడానికి మా స్కూళ్లు, కాలేజీలు కావాలి... మీకు జబ్బుచేస్తే నయం చేయడానికి మా డాక్టర్లు కావాలి' అని ఎద్దేవా చేశారు. 'మీరు మమ్మల్ని వ్యతిరేకించాలనుకుంటే... మా విద్యాసంస్థల నుంచి మీ పిల్లలను తీసుకెళ్లండి'అని ఘాటుగా వ్యాఖ్యానించారు.