: కంటతడి పెట్టిన కవిత


అలనాటి అందాలతార, టీడీపీ నేత కవిత కంటతడి పెట్టారు. చెన్నైలో జరుగుతున్న వందేళ్ళ సినీ వేడుకలకు తనను ఆహ్వానించకపోవడం పట్ల ఆమె మనస్తాపం చెందారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, సూపర్ స్టార్లతో నటించిన చరిత్ర తనదని, తనను పిలవకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కాకాదారులు, పొగిడేవాళ్ళనే పిలుస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ అంటే ఎవరో ఒకరిద్దరు కాదని ఆగ్రహం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News