: 'అత్తారింటికి..' లీక్ పై పలువురు సినీ ప్రముఖుల ట్వీట్లు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది 90 నిమిషాల నిడివి కలిగిన వీడియో లీక్ కావడంపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి వారి ఆగ్రహాన్ని ట్విట్టర్లో వ్యక్తం చేశారు. అత్తారింటికి దారేది సినిమా ఇంటర్నెట్ లో లీక్ కావడం దారుణమని, దీన్ని అందరూ ఖండించాలని.. అభిమానులు, సినీ పరిశ్రమ దీన్ని అడ్డుకోవాలి అని రాంగోపాల్ వర్మ పిలుపునిచ్చారు. 'దయ చేసి ఆ లింకును నాకు కానీ మరెవరికి కానీ ఎవరూ ఆన్ లైన్లో పంపించొద్దు ముందుగా ఏపీ ఫిల్మ్ చాంబర్ లీగల్ సెల్ కు పంపించండి' అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

హీరో నితిన్.. 'దయచేసి పైరసీని ప్రోత్సహించకండి.. తెలుగు సినీ పరిశ్రమను కాపాడండి' అంటూ ట్వీట్ చేశారు. మరో దర్శకుడు హరీష్ శంకర్ 'సినిమాను కాపాడండి, పైరసీని ప్రోత్సహించకండి' అని సినీ అభిమానులు, ప్రేక్షకులను కోరారు. ఆ లింకును సోషల్ సైట్లలో పెట్టకుండా సంయమనం పాటించండని సూచించారు.

సినీ ప్రేమికులు, పవన్ అభిమానులంతా సినిమాకు మద్దతు పలికి పైరసీని అడ్డుకోవాలని అల్లు శిరీష్ పిలుపునిచ్చారు. సంగీత దర్శకుడు తమన్ తన ట్వీట్ లో కొంత మంది సృజనాత్మకత, ఎంతో మంది శ్రమను దోపిడీ చేయడం నేరం అని అన్నారు. సినిమాలో నటించిన రకుల్ సింగ్ తాను షాక్ కు గురయ్యానని తెలిపారు.

  • Loading...

More Telugu News