: మ్యాంగో డ్రింకులో చచ్చిన పాము!


మొన్నటికిమొన్న కేరళలో ఓ కర్రీ ప్యాకెట్లో చచ్చిన పాము కనిపించిన సంఘటన మరువకముందే, ఆ రాష్ట్రంలోనే అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలో సాజివ్ అనే వ్యక్తి తన రెండున్నరేళ్ళ కుమార్తెకు ఓ షాపులో మ్యాంగో డ్రింకు టెట్రా ప్యాక్ కొనిచ్చాడు. పాప మొత్తం డ్రింకును తాగేసిన తర్వాత ప్యాక్ లో ఏదో ఇంకా ఏదో ఉందని భావించారు. ఆ పాప నాయనమ్మ ఆ ప్యాక్ ను చించి చూడగా, అందులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న పాము కనిపించింది. దీంతో, ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చగా, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. సాజివ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మ్యాంగోడ్రింక్ ప్యాక్ పై తేదీలను పరిశీలించగా, అది కాలం చెల్లినదని గుర్తించారు.

  • Loading...

More Telugu News