: 'అత్తారింటికి..' లీక్ వ్యవహారంలో ఓ వెబ్ సైట్ కు నోటీసులు


పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అత్తారింటికి దారేది విడుదలకు ముందే పైరసీకి గురికావడంపై చిత్ర వర్గాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సినిమా లింకును తొలుత ఇంటర్నెట్లో ఉంచిన మీడియా ఫైర్ వెబ్ సైట్ కు నోటీసులు జారీ చేశారు. అంతేగాకుండా, ఇంటర్నెట్లో ఉన్న ఈ సినిమా లింకులను బ్లాక్ చేస్తున్నారు. కాసేపట్లో ఈ విషయమై చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News