: చిదంబరం, షిండే లు నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు: బాబు
జాతీయ సమగ్రతా మండలి(ఎన్ఐసీ) లో తన ప్రసంగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర హోం మంత్రి షిండేలు అడ్డుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ తీరుకు నిరసనగా టీడీపీ ఎన్ఐసీ సమావేశం నుంచి వాకౌట్ చేసిందని అన్నారు. రాష్ట్ర సమస్యలను ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సమస్యలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.