: ఏపీఎన్జీవోల సమ్మె విచారణ రేపటికి వాయిదా


ఏపీఎన్జీవోల సమ్మె పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టులో వాదనల నేపథ్యంలో... ఏపీఎన్జీవోల తరపు న్యాయవాది రామచంద్రరాజు వాదిస్తూ... ఏపీ ఎన్జీవోలు మొదట భారత పౌరులని, ఆ తర్వాతే ఉద్యోగులని తెలిపారు. బాధ్యత గల పౌరులుగా వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసమే సమ్మె చేస్తున్నారని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మె ఇప్పుడు ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలిపారు. ఈ ఉద్యమానికి ఆరు కోట్ల మంది ప్రజల మద్దతుందని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News