: జాతీయ సమగ్రత మండలి సమావేశం నుంచి టీడీపీ వాకౌట్
ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న జాతీయ సమగ్రత మండలి సమావేశం నుంచి తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. ఈ పార్టీకి చెందిన ఎంపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన వంటి కీలక అంశాన్ని చర్చించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం ఇలాంటి విషయాలు పట్టించుకోరని బాబు మండిపడ్డారు. ఇరుప్రాంతాల నేతలతో చర్చించి సమస్యకు పరిష్కరించాలని బాబు సూచించారు. ఇరుప్రాంతాల నేతలతో చర్చించాలన్నా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడంలేదని బాబు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ఉండే మేధావులు విభజనపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.