: మోడీ లెక్కలు తప్పుల తడకలు: చిదంబరం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హయాంలో 8.4 శాతం వృద్ధి రేటు ఉందంటూ మోడీ చెప్పిన లెక్కలన్నీ తప్పులేనని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వాజ్ పేయి పరిపాలించిన ఆరేళ్ల నాటి వృద్ధి రేటు సగటు కేవలం 6 శాతం అని అన్నారు. పోనీ, ఐదేళ్లలో చూసుకున్నా అది 5.9 శాతం మాత్రమేనని ఆయన వెల్లడించారు. అదే యూపీఏ-1 పరిపాలనా కాలంలో 8.4 శాతం కాగా, యూపీఏ-2 పాలనలోని నాలుగేళ్లలో 7.3 శాతం ఉందని చిదంబరం తెలిపారు. యూపీఏ సాధించిన అభివృద్ధిని తామే సాధించినట్లు మోడీ చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.