: జగన్ క్విడ్ ప్రో-కో కు ఆధారాలు లేవు: సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో పలు కంపెనీల్లో క్విడ్ ప్రో-కో జరిగినట్టు ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పీవీపీ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ-బ్రహ్మణి ఇన్ ఫ్రాటెక్, ఆర్ ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, మంత్రీ డెవలపర్స్ వ్యవహారాల్లో క్విడ్ ప్రో-కో కు పాల్పడినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ కంపెనీలు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించిన సీబీఐ ఈడీ, ఆదాయ పన్ను శాఖకు వివరాలు పంపినట్లు తెలిపింది. 16 సూట్ కేసు కంపెనీల వ్యవహారాలపై చర్యలకు ఈడీ, ఆదాయపు పన్ను శాఖకు సిఫారసు చేసినట్టు వెల్లడించింది.