: అమెరికాలో జాత్యహంకార దాడి.. గాయపడ్డ సిక్కు ప్రొఫెసర్
అమెరికాలో మరోసారి జాత్యహంకార ఘటన చోటు చేసుకుంది. సిక్కులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ సిక్కు ప్రొఫెసర్ ను ఉగ్రవాదివంటూ ద్వేషిస్తూ కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్, పబ్లిక్ ఎఫైర్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుజ్యోత్ సింగ్ ను ఒసామా అని పేర్కొంటూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రభుజ్యోత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో ముందుపళ్లు రాలిపోయాయి. ప్రస్తుతం ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.