: నేడు జగన్ బెయిల్ పై తీర్పు
అక్రమాస్తుల కేసులో ఏడాదిగా చంచల్ గూడ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టు ఈ రోజు మధ్యాహ్నం తన నిర్ణయాన్ని వెలిబుచ్చనుంది. కాగా, జగన్ బెయిల్ విషయంలో ఇంతకుముందు జరిగిన విచారణలో.. ఆయనకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ వాదించిన సంగతి తెలిసిందే.