: సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం: ఇది ముఖ్యమంత్రుల మాట


దేశంలో జరుగుతున్న అల్లర్లలో ఎస్సెమ్మెస్ లతో పాటు, సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రత సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. అల్లర్లకు కారణమయ్యే వివరాలను, విషయాలను ఈ మీడియా అత్యంత వేగంగా ఎంతో మందికి చేరవేస్తోందని అన్నారు.

సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... సోషల్ మీడియాను చాలా బాధ్యతగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలను పెంచడానికి దీన్ని వాడుకోరాదని హితవు పలికారు. ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా అగ్నికి ఆజ్యం పోసే వారిని పట్టుకోవడానికి ప్రభుత్వాలు కొత్త మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ సందర్భంగా ముజఫర్ నగర్ అల్లర్లను తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది ఒక నకిలీ వీడియోనే అని ఆయన గుర్తుచేశారు. సోషల్ మీడియా ద్వారా అతి స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో అనేక మందికి చేరిందని తెలిపారు.

ఎస్సెమ్మెస్ లు, సోషల్ మీడియా ద్వారా సమాచారం చాలా ఈజీగా చేతులు మారుతుండటం ఆందోళన కలిగించే అంశమని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఇలాంటి మెసేజ్ లను నియంత్రించేందుకు కచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News