: జగన్ కేసులో దర్యాప్తు పూర్తయింది: సీబీఐ


జగన్ అక్రమాస్తుల కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ నేడు న్యాయస్థానానికి తెలిపింది. హైకోర్టు చెప్పిన అన్ని అంశాలపైనా దర్యాప్తు చేశామని వివరించింది. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి వ్యవహారంపై నివేదిక అందించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో 9, 10 చార్జ్ షీట్లకు సంబంధించి కొత్త అంశం తెలిసిందని వెల్లడించింది. త్వరలోనే కోర్టుకు తుది నివేదిక ఇస్తామని పేర్కొంది. అయితే ఈ కేసులో ఐటీ, ఈడీలు వేర్వేరుగా దర్యాప్తు కొనసాగిస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News