: నేడు హిందూపురంలో ఏపీఎన్జీవోల బహింరంగ సభ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురంలో ఏపీఎన్జీవోల భారీ బహిరంగ సభ జరగనుంది. మరి కొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభంకానుంది. ఏపీఎన్జీవో నాయకులు, సీమాంధ్రకు చెందిన మేధావులు ఈ సభలో పాల్గొననున్నారు. అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, సమైక్య వాదులు భారీగా తరలివస్తున్నారు. సభకు హాజరవుతున్న ఉద్యమకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... నిర్వాహకులు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు