: రేపు రాజీనామా చేయనున్న సీమాంధ్ర ఎంపీలు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు (మంగళవారం) రాజీనామా చేయనున్నారు. అంతేకాకుండా స్పీకర్ మీరాకుమార్ ను వ్యక్తిగతంగా కలుసుకొని తమ రాజీనామాలను ఆమోదించాలని కోరనున్నారు. ఈ వివరాలను అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. రేపు ఉదయం 11.30 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. తనతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావులు రాజీనామా చేయనున్నారని అన్నారు.
ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్ లో తాము పంపిన రాజీనామాలు స్పీకర్ వద్ద ఉన్నాయని... వాటిని ఆమోదింపజేసుకోవడానికే స్పీకర్ ను కలవనున్నామని ఎంపీ అనంత తెలిపారు. రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి చేయరాదని సీఎంతో పాటు రాష్ట్ర మంత్రుల నుంచి ఒత్తిడి వస్తోందని... అయితే తాము రాజీనామాలకే నిర్ణయించుకున్నామని అన్నారు.