: మూగవారూ మాట్లాడవచ్చు!


మూగవారు ఎలా మాట్లాడగలరు? అని ఆశ్చర్యంగా ఉందా... మాటలురాని మూగవారు సైతం మాట్లాడే విధంగా ఒక ప్రత్యేకమైన పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త పరికరంతో మూగవారు తమ భావాలను వినిపించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూగవారు తాము వెలువరించాలనుకున్న భావాలను తెలపడానికి ఇప్పటికే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పరికరంలో ధ్వనులు యాంత్రికంగా ఉంటున్నాయి. అలాకాకుండా ఈ ధ్వనులను సహజంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేశారు. వారి కృషి ఫలితంగా మూగవారు మాట్లాడేందుకు ఉపకరించే ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. భారత సంతతికి చెందిన రూపల్‌ పటేల్‌ సహా పలువురు శాస్త్రవేత్తలు కలిసి వోకల్‌ ఐడీ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు. మూగవారు అత్యంత సహజంగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతుందని పటేల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News