: గుండెపోటు మరణాలు ఇక్కడే ఎక్కువట
మనదేశంలోనే గుండెపోటుతో సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని పలువురు గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే చిన్న వయసులోనే ఎక్కువమంది గుండెకు సంబంధించిన వ్యాధులకు లోనవుతున్నారని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బేసిక్స్ అండ్ బియాండ్-13 పేరిట ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్డియాలజీ వర్క్‌షాప్‌లో దేశ విదేశాలకు చెందిన సుమారు 500 మంది గుండె వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, పనిఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటి పలు అంశాలు గుండెకు సంబంధించిన రోగాలకు కారణమవుతున్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.