: దాడిని ఖండిస్తూ కెన్యా అధ్యక్షుడికి ప్రధాని మన్మోహన్ లేఖ
కెన్యా రాజధాని నైరోబీలో షాపింగ్ మాల్ పై ఉగ్రవాదుల దాడిని ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు. దాడిపై కెన్యా అధ్యక్షుడికి ప్రధాని లేఖ రాశారు. దాడికి గురైన భారతీయులను ఆదుకోవాలని విదేశాంగ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ షాపింగ్ మాల్ దాడిలో ఇద్దరు భారతీయులతో పాటు 59 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.