: మంగళగిరి దగ్గర టీఆర్ఎస్ నేతలు కూడా భూములు కొన్నారు: బైరెడ్డి


విభజన అంటూ జరిగితే రాష్ట్రం మూడు ముక్కలు కావాల్సిందేనని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ పదవులకు రాజీనామా చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ నాయకుడూ చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆయన విమర్శించారు. కొత్త రాజధాని ఏర్పాటు అంటూ గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, మంగళగిరికి దగ్గర్లో మరిన్ని వసతుల కల్పనకు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలే కాకుండా, ఆంధ్రులు దోచుకున్నారని వాదించే టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారని బైరెడ్డి వెల్లడించారు.

విభజన జరిగితే రాష్ట్రం మూడు ముక్కలు కావాల్సిందేనని, లేదంటే ప్రధమ రాజధాని కర్నూలు కావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతే కానీ, కోస్తాతో కలిసి ఉండడాన్ని కానీ, కోస్తాలో రాజధాని కానీ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News